Tirumala Brahmotsavalu Schedule: తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఏయే రోజుల్లో ఏయే వాహన సేవంటే.. - టీటీడీ
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2023, 7:23 PM IST
Tirumala Brahmotsavalu Schedule : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ తితిదే (TTD) ఘనంగా నిర్వహించింది. తిరుమల కొండ విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 26 వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా తొలిరోజు సోమవారం సాయంత్రం 6: 15గంటలకు ధ్వజారోహణం, రాత్రి 9గంటలకు పెదశేష వాహనం అలంకార సేవ జరిపించనున్నారు. 19 వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు చినశేష వాహనం, రాత్రి 7గంటలకు హంసవాహన సేవ జరగనుంది. 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు సింహ వాహన సేవ, రాత్రి 7గంటలకు ముత్యపు పందిరి వాహనం సేవ నిర్వహించనున్నారు. 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు కల్ప వృక్ష వాహన సేవ, రాత్రి 7గంటలకు సర్వ భూపాల వాహనం సేవ జరిపించనున్నారు.
సెప్టెంబర్ 22వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7గంటలకు గరుడ వాహన సేవ జరగనుంది. 23వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు హనుమత్ వాహనం, సాయంత్రం 4గంటలకు స్వర్ణ రథం సేవ, రాత్రి 7గంటలకు గజ వాహన సేవ నిర్వహించనున్నారు. 24వ వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7గంటలకు చంద్ర ప్రభ వాహనం సేవ, 25 వ తేదీ సోమవారం ఉదయం 6:55 గంటలకు రథోత్సవం, రాత్రి 7గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజైన సెప్టెంబర్ 26 వ తేదీ మంగళవారం ఉదయం 6:55 గంటలకు చక్రస్నానం, రాత్రి 9గంటలకు ధ్వజారోహణం నిర్వహించనున్నారు.