అమ్మో.. నాలుగు పెద్దపులి పిల్లలు.. భయంతో వణికిపోతున్న ప్రజలు - nandyal tiger cubs videos

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 6, 2023, 3:36 PM IST

Tiger Cubs: నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం సమీపంలో పెద్దపులి పిల్లల సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు వాటిని గమనించాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించాడు. ఆ ప్రాంతంలో నాలుగు పులి పిల్లలు ఉన్నాయి. క్యూట్ క్యూట్​గా.. చూసేందుకు చాలా అందంగా ఉన్న పులి పిల్లలను స్థానికులు గ్రామంలోకి తీసుకుని వచ్చారు. అయితే ఒకేసారి ఇలా నాలుగు పులి పిల్లలు కనిపించటం వల్ల.. అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తల్లి పులి వస్తుందేమోనన్న భయంతో స్థానికులు.. పులి పిల్లలను ఓ గదిలో వదిలిపెట్టారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. పులి పిల్లలు లభించిన చోటే విడిచిపెట్టారు. తల్లి పులి.. పిల్లల కోసం అక్కడికి వస్తుందేమోనని అధికారులు ఆ ప్రాంతంపై నిఘా పెట్టారు. అయితే ఆహారం, నీటి కోసం సమీపంలో ఉన్న నల్లమల అడవి నుంచి దిగువ ప్రాంతానికి ఈ పులులు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 

ఇటీవల ఇక్కడికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు మండలం నల్ల కాలువ సమీపంలో ఓ ఆవుపై పులి దాడి చేసింది. అలాగే పాములపాడు మండలంలోని భానుముక్కుల సమీపంలో కూడా పెద్ద పులిని స్థానికులు చూశారు. ఈ వరుస పులుల సంచారంతో ఆ పరిసర ప్రాంతాల వారు భయంతో వణికిపోతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.