ETV Bharat / state

రెయిన్​ అలర్ట్ : అల్పపీడనం ఎఫెక్ట్ ​- నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు! - HEAVY RAINFALL FORECAST

పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - ఈ నెల 26 వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు - కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

HEAVY RAIN FORECAST IN AP
Heavy Rainfall alert in Andhra Pradesh for Four Days (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2024, 6:59 AM IST

Heavy Rainfall alert in Andhra Pradesh for Four Days : పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ ఈ నెల 24 (మంగళవారం) నాటికి ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​లోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి 26 వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నెల్లూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఈ నెల 25 వరకు సముద్రంలో గంటకు గరిష్ఠంగా 55 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఏపీలోని పోర్టులకు మూడో నంబర్ హెచ్చరిక జారీ చేయనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ నెల 26 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. సముద్రంలో తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతోంది. దీంతో దాని కదలికలను అంచనా వేయడం చాలా కష్టమవుతోంది. ఈ నెల 22న తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని మొదట వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ అల్పపీడనం అవశేషాలు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళుతున్నట్లు నిపుణులు అంటున్నారు.

పశ్చిమ గాలుల ప్రభావంతోనే : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేవని, అందుకే ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఇలాంటివి అరుదుగా జరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26 వరకు దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అయితే అల్పపీడనం తీరానికి చేరువగా వెళ్తుందా? లేదా తీరం దాటుతుందా అనే అంశంపై స్పష్టత లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్పపీడనం ఏర్పడి, తర్వాత అది వాయుగుండంగా బలపడి తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని వాతావరణ శాఖ నిపుణులు భావించారు. అయితే అది తర్వాత రెండ్రోజులకు తీవ్ర అల్పపీడనంగా మారి ఏపీ తీరం వైపు వచ్చింది.

మరో రెండు రోజులకు వాయుగుండంగా మారగా శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. సుమారు వారం రోజులుగా అల్పపీడనం ప్రయాణం కొనసాగుతోంది. ఉత్తర భారతం నుంచి వీచే పశ్చిమ గాలుల ప్రభావంతోనే వాయుగుండం ఉత్తర కోస్తా తీరం వైపు ప్రయాణించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వాటి ప్రభావం తగ్గడంతో మళ్లీ దిశ మార్చుకుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో సుమారు 5 రోజులుగా మత్స్యకారుల పడవలు ఒడ్డుకే పరిమితమయ్యాయి. కాగా మరో నాలుగు రోజులు కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తప్పిన వాయుగుండం ముప్పు - మూడు రోజుల్లో వానలే వానలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.