ETV Bharat / spiritual

కాకులు వాలని శివయ్య కొండ- పెళ్లిళ్లు జరగని ఆలయం- ఎక్కడ ఉందో తెలుసా? - KOTAPPAKONDA TEMPLE

కాకులు వాలని కోటప్ప క్షేత్రం - గుడి విశిష్టత మీ కోసం!

Kotappakonda
Kotappakonda (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Kotappakonda Temple History : కాకులు దూరని కారడవి అనే పదం మనందరికీ పరిచయమైనదే. కానీ కాకులు వాలని కొండ ఎప్పుడైనా విన్నారా? అలాంటి కొండ నిజంగా ఉందా? అవును ఉంది. ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. కానీ ఈ కొండపై మాత్రం కాకులు వాలవు. ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణమేమిటి? అసలు ఇంతకీ ఆ కొండ ఎక్కడుంది? తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఈ కథనం పూర్తిగా చదవండి.

కోటప్పకొండ
కోటప్ప కొండగా ప్రఖ్యాతి చెందిన త్రికూటాద్రి " శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉంది. ఈ కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం అని అక్కడి స్థానికుల అభిప్రాయం. అసలు ఈ కొండపై కాకులు వాలకుండా శాపం ఎందుకొచ్చిందో తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి.

త్రిమూర్తి శిఖరం త్రికూటాద్రి
కోటప్పకొండను త్రికోటేశ్వరాయలం, త్రికుటాద్రి అని కూడా పిలుస్తారు. గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందిన ఈ క్షేత్రంలో ఏ దిశలో చూసినా రుద్ర, బ్రహ్మ, విష్ణు అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకే దీనిని "త్రికుటాద్రి అని పిలుస్తారు.

ఆలయ స్థల పురాణం
దక్షయజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీదేవి దేహత్యాగం చేస్తుంది. సతీదేవి వియోగం తర్వాత పరమ శివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా, కోటప్పకొండ శివుని ఆకర్షించి, ఆశ్రయమిచ్చింది. శివుడు బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగ్నుడై తపస్సు గావించిన పవిత్ర స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం.

గొల్లభామ భక్తి
ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా 'ఆనంద వల్లి' అనే గొల్లభామ ప్రతిరోజూ పాలు, తేనెలతో శివుని సేవిస్తూ ఉండేది. అలాగే ఆ ప్రాంతానికి చెందిన శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటం వల్ల అతనికి బాలయోగిలా, దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శాలంకయ్య శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు.

కాకులకు ఇందుకే శాపం
ఒకసారి గొల్లభామ శివుడ్ని సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను, పాల కుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాల కుండలపై వ్రాలి పాలను ఒలకబోయటంతో అది చూచి గొల్లభామ కోపంతో “ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించిందంట. ఆమె శాపం వ్యర్థం కాకూడదని శివుడు తధాస్తు అన్నాడంట. అందుకే ఇప్పటికీ కోటప్ప కొండపై కాకులు వాలవు.

శివుని ఆతిధ్యానికి పిలిచిన శాలంకయ్య
ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వేడుకున్నాడు. అప్పుడు స్వామి అలాగే తాను వస్తానని, శాలంకయ్యను ఇంటికి వెళ్లమని అంటాడు. మరోవైపు గొల్లభామ ఆనందవల్లి గర్భవతై 'కొండకు రాలేకపోతున్నాను తండ్రీ, నీవే క్రిందకు రా' అని శివుడిని వేడుకుందంట. శివుడు ఆమె మొర విని గొల్లభామతో "నేను క్రిందకు దిగి వచ్చే వరకు నీవు వెనుతిరిగి చూడరాదు అని అనగా, సరే అంటూ ఆ గొల్లభామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు.

శివుని అడుగుల ధాటికి పగిలిన కొండలు
శివుని పాద ధాటికి కొండలు పగిలి భయానకం కలిగించాయి. ఆ శబ్దాలు విన్న గొల్లభామ ఏమి జరిగిందో చూడాలన్న ఆత్రుతతో, శివునికి ఇచ్చిన మాట మర్చిపోయి వెనుకకు తిరిగి చూసింది. ఆమె చూడగానే పరమ శివుడు అక్కడికక్కడే లింగ రూపంగా మారాడు. ఆ గొల్లభామ కూడా అక్కడే శిలగా మారిపోయింది.

శివుని వెతుక్కుంటూ వచ్చిన శాలంకయ్య
తన ఇంటికి ఆతిధ్యానికి వస్తానన్న శివుడు ఎంతకూ రాకపోయేసరికి శాలంకయ్య కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనబడింది. శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుంటే శివలింగం నుంచి ఆశ్చర్యకరంగా 'ఈ కొండ క్రిందకు కోటి ప్రభలు ఎప్పుడు వస్తాయో, అప్పుడు నేను కొండ దిగి వస్తాను' అనే శివ వాణి వినిపించింది. అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి, దాని గురించి ప్రజలకు వివరించి, అందరిని ప్రభలు కట్టుకుని స్వామి దగ్గరకు రమ్మని వేడుకున్నాడు.

దిగిరాని శివయ్య
ఆనాటి నుంచి భక్తులు ప్రభలు కట్టుకుని స్వామి దర్శనానికి వస్తూనే ఉన్నారు. ఇంకా కోటి ప్రభలు పూర్తి కాలేదు స్వామి కిందకు దిగి రాలేదు.

శ్రీకృష్ణ దేవరాయల కానుకలు
కోటప్పకొండ స్వామి వారి అనుగ్రహంతో శ్రీకృష్ణ దేవరాయులు కొండవీడుని జయించాడు. ఆ సమయంలో కోటప్పకొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి, నిత్య ధూప దీప నైవేద్యాలకు 'కొండ కావూరు'అనే గ్రామాన్ని రాసి ఇచ్చినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ గొల్లభామ ఆనందవల్లికి కూడా ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని, స్వామి వారి ఆలయాన్ని శాలంకయ్య నిర్మించాడు. శాలంకయ్య అమ్మవారికి ఆలయం కట్టించాలని అనుకున్నాడు కాని శివుడు శాలంకయ్య కలలోకి వచ్చి "సతీ దేవి వియోగంలో ఉన్న వాడిని, ఆమెకు గుడి కట్టించవద్దు" అని చెప్పడం వల్ల శాలంకయ్య అమ్మ వారికి గుడి కట్టించలేదు.

ఉత్సవాలు వేడుకలు
కోటప్పకొండలో మహాశివరాత్రి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి. కొండపై కనిపించే 'చతుర్ముఖ బ్రహ్మ' ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆలయంలోని ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక పక్క వినాయకుడు మరొక ప్రక్క కుమార స్వామి, మధ్యలో దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుని ఆరాధిస్తూ, సేవిస్తూ ఉన్న ఋషి పుంగవులు దర్శనం ఇస్తారు. ఎడమ ప్రక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం ఉంది. అలాగే యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉంది.

పెళ్లిళ్లు జరగని ఆలయం
మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతున్న కోటప్పకొండను ఒక్కసారైనా దర్శించుకుంటే తలపెట్టిన అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుందని విశ్వాసం. అలాగే దక్షిణామూర్తి రూపంలోని శివుని దర్శించడం వల్ల జ్ఞానం, పూర్ణాయుష్షు కలుగుతుంది.

ఎలా చేరుకోవచ్చు
నరసరావుపేటకి 12 కి.మీ, గుంటూరుకి 56 కి.మీ. దూరంలో ఉన్న కోటప్పకొండను చేరుకోవడానికి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. మనం కూడా కోటప్ప కొండను దర్శించుకుందాం. సకల శుభాలను పొందుదాం. ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఏడాదికి రెండు సార్లు కల్యాణోత్సవం- అభిషేకం లేని స్వామి- ద్వారక తిరుమల విశేషాలివే!

ఆరోగ్య ప్రదాత ఈ ఆదిత్యుడు - కోణార్క్ సూర్య దేవాలయ విశేషాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.