ETV Bharat / sports

పీవీ సింధు వెడ్స్ దత్త సాయి - రాజస్థాన్​లో గ్రాండ్ సెలబ్రేషన్స్ - PV SINDHU WEDS DATTA SAI

దత్త సాయితో పీవీ సింధు వివాహం - రాజస్థాన్​లో వైభవంగా పెళ్లి వేడుక

PV Sindhu Marriage
PV Sindhu (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 23, 2024, 6:48 AM IST

PV Sindhu Marriage : బ్యాడ్మింటన్‌ స్టార్ పీవీ సింధు తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ ఇద్దరూ రాత్రి 11.20 గంటలకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌ సాగర్‌ సరస్సులో ఉన్న రఫల్స్‌ హోటల్‌ ఈ పెళ్లి వేడుక గ్రాండ్​గా జరిగింది. ఇక మంగళవారం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ జరగనుంది.

ఆటలపై ఆసక్తి
సింధు భర్త సాయి వెంకట దత్తా బ్యాడ్మింటన్‌ ఆడరు కానీ ఆయనకు ఆటలపై బాగానే ఆసక్తి ఉంది. మోటార్‌ స్పోర్ట్స్‌లో తనకు ప్రవేశం ఉంది. డర్ట్‌ బైకింగ్, మోటార్‌ ట్రెక్కింగ్‌లో తరచూ పాల్గొంటుంటారు. తన దగ్గర డజను సూపర్‌ బైక్స్‌తో పాటు కొన్ని స్పోర్ట్స్‌ కార్లూ ఉన్నాయి. తన తండ్రి గౌరెల్లి వెంకటేశ్వరరావు ఇన్​కమ్​ట్యాక్స్ డిపార్ట్​మెంట్​లో మాజీ అధికారి.

ప్రస్తుతం సాయి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న ప్రోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థను ఆయనే నెలకొల్పారు. సాయి తల్లి లక్ష్మి. ఆమె తండ్రి భాస్కరరావు హైకోర్టు జడ్జిగా పదవీ రిటైర్ అయ్యారు. భాస్కరరావు అన్న ఉజ్జిని నారాయణరావు సీపీఐ పార్టీ తరఫున నల్గొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ (జేఎస్‌డబ్ల్యూ)తో ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ప్రారంభించిన సాయి, జేఎస్‌డబ్ల్యూ సహ యజమానిగా ఉన్న దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు వ్యవహారాల్ని చూసుకున్నారు.

వెంకట్‌ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనకు ఓ కంపెనీ ఉంది. దాన్ని నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇక నా షెడ్యూల్‌ కూడా తీరిక లేకుండానే ఉంటుంది. అందుకే మేమిద్దరం చాలా తక్కువ సార్లే కలిశాం. వెంకట్‌ బ్యాడ్మింటన్‌ ఆడరు. కానీ నా మ్యాచ్‌లన్నీ చూస్తారు. బ్యాడ్మింటన్‌ను ఫాలో అవుతారు. స్పోర్ట్స్ అంటే ఇష్టం. కానీ బిజినెస్​ వైపు వెళ్లారు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్, డేటా సైన్స్‌ కోర్స్​లను పూర్తి చేశారు. ప్రస్తుతం సొంత కంపెనీ పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌కు ఆయన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

- పీవీ సింధు

'పెళ్లైన తర్వాత బ్యాడ్మింటన్‌ కంటిన్యూ చేస్తాను - ఇప్పటికీ రోజూ ప్రాక్టీస్ చేస్తున్నా'

మిస్​ టు మిసెస్​ - స్పెషల్ ఈవెంట్​లో రింగ్స్ మార్చుకున్న పీవీ సింధు జంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.