ETV Bharat / international

ఇళ్లను ఢీకొట్టి కూలిన విమానం- ఒక ఫ్యామిలీలోని 10మంది ప్రయాణికులు మృతి - BRAZIL PLANE CRASH

బ్రెజిల్‌లో విమానం కూప్పకూలి 10 మంది ప్రయాణికులు మృతి

Brazil Plane Crash
Brazil Plane Crash (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

Brazil Plane Crash : బ్రెజిల్‌లో విమాన ప్రమాదం జరిగింది. పర్యటకానికి ప్రసిద్ధిగాంచిన గ్రామాడో పట్టణంలో ఒక చిన్న పర్యాటకుల విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్లతో సహా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. విమానం పడ్డ చోట మనుషులు ఉండటం వల్ల సుమారు 15 మందికి పైగా ప్రజలు గాయపడ్డట్లు బ్రెజిల్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించింది.

అధికారుల సమాచారం ప్రకారం, విమానం ముందుగా ఒక చిమ్నీని తాకింది. అనంతరం ఒక భవనం రెండో అంతస్తును ఢీకొట్టి, చివరగా ఒక మొబైల్‌ ఫోన్‌ల దుకాణంపైన కూలిపోయింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ మృతిచెందారు. ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమా లేదా మరేమైనా కారణాలున్నాయా తెలియరాలేదు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలిసింది. రియోగ్రాండే దో సుల్ రాష్ట్రం నుంచి సావోపాలో రాష్ట్రంలోని గ్రామాడో గ్రామానికి క్రిస్మస్‌ సెలవుల కోసం వెళ్తుండగా ఘటన జరిగింది.

Brazil Plane Crash
ధ్వంసమైన నిర్మాణ సముదాయం (Associated Press)
Brazil Plane Crash
కుప్పకూలిన విమాన దృశ్యాలు (Associated Press)

జర్మనీలో క్రిస్మస్‌ మార్కెట్‌పై ఉగ్రదాడి
ఇటీవల తూర్పు జర్మనీలోని మాగ్దబగ్‌ నగరంలో క్రిస్మస్‌ కొనుగోలుదారులతో రద్దీగా ఉన్న మార్కెట్‌లో ఒక కారు జనంపైకి దూసుకు పోగా ఐదుగురు మరణించారు. ఏడుగురు భారతీయులు సహా 200 మందికి పైగా గాయపడ్డారు. శుక్రవారం నాటి ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని అధికారులు తెలిపారు. దురాగతానికి కారకుడైన వ్యక్తిని సౌదీ అరేబియాకు చెందిన వైద్యుడు ఎ.తలేబ్‌(50)గా గుర్తించారు. కోపోద్రిక్తులైన ప్రజలు ఘటనా స్థలంలోనే అతడిని చితకబాదారు. అనంతరం పోలీసులు అరెస్టుచేశారు. తనను తాను మాజీ ముస్లింగా పేర్కొనే తలేబ్‌ ఎందుకు ఈ దురాగతానికి పాల్పడ్డాడన్నది ఇంకా స్పష్టం కాలేదు.

ప్రతిరోజూ డజన్ల కొద్దీ ఇస్లాం వ్యతిరేక పోస్టులు పెట్టడం అతనికి అలవాటు. అతివాద జాతీయ పార్టీ అయిన ఆల్టర్నేటివ్‌ ఫర్‌ జర్మనీ పార్టీకి అతడు మద్దతుదారు. తలేబ్‌ 2006 నుంచి జర్మనీలో నివాసం ఉంటున్నాడని, మాగ్దబగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెర్న్‌బగ్‌లో వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడని సాక్సనీ అన్హాల్ట్‌ రాష్ట్ర అంతర్గత వ్యవహారాల మంత్రి తమారా జీష్‌చాంగ్‌ తెలిపారు. మాగ్దబగ్‌ దాడికి బాధ్యుడు ఒక్కడేనని, తనకు తెలిసినంతవరకూ నగరానికి మరే ముప్పూ లేదని సాక్సనీ అన్హాల్ట్‌ రాష్ట్ర గవర్నర్‌ రీనర్‌ హేస్‌లాఫ్‌ విలేకరులకు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం బెర్లిన్‌ నగరంలో రద్దీగా వున్న క్రిస్మస్‌ మార్కెట్‌పై ఒక ఇస్లామిక్‌ ఉగ్రవాది ట్రక్‌ నడిపి 13 మంది మృతికి కారకుడయ్యాడు.

Last Updated : 4 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.