మంచులో గర్భిణీని ఆస్పత్రికి తరలించి కాపాడిన సైన్యం - జమ్ముకశ్మీర్‌లో గర్భిణి మహిళను కాపాడిన సైన్యం
🎬 Watch Now: Feature Video
జమ్ముకశ్మీర్‌లో సైన్యం గొప్ప మనసును చాటుకుంది. ప్రసవ నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆస్పత్రి తీసుకెళ్లి కాపాడారు. కుప్వారా జిల్లా కలారోస్ గ్రామంలో ఒక గర్భిణీ ప్రాథమిక కేంద్రంలో వైద్యం తీసుకుంటుండగా ఆమె పరిస్థితి విషమించింది. వైద్యులు వేరే ఆస్పత్రకి తీసుకెళ్లాలని సూచించారు. తీవ్రంగా మంచు కురుస్తున్న కారణంగా అక్కడి రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. అంబులెన్స్ రావడానికి కూడా అవకాశం లేదు. దీంతో గర్భిణీ కుటుంబ సభ్యులు కలారోస్లోని ఆర్మీ క్యాంప్‌కు వెళ్లి వారిని సహాయం కోరగా.. జవానులు తమ వాహనంలో గర్భిణీని ఆస్పత్రికి తరలించారు. సైన్యం చేసిన సహాయానికి గర్భిణీ కుటుంబీకులు, స్థానిక ప్రజలు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.