Telangana TDP Vice President Suhasini Interview : 'అరెస్టుతో చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ తగ్గించలేరు' - ట్యాంక్ బండ్ దగ్గర టీడీపీ నాయకుల నిరసన
🎬 Watch Now: Feature Video
Published : Sep 20, 2023, 5:23 PM IST
Telangana TDP Vice President Suhasini Interview : రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు చేశారని.. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలు సుహాసిని అన్నారు. చంద్రబాబును విడుదల చేయాలంటూ.. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆ పార్టీ అనుబంధం సంఘమైన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నిరసన చేపట్టింది. టీఎన్టీయూసీ నేతలు(TNTUC Leaders) చేపట్టిన మౌనప్రదర్శనకు తెలుగుదేశం నాయకురాలు నందమూరి సుహాసిని మద్దతు తెలిపింది. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతీపత్రం అందజేశారు. చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను ఆమె తీవ్రంగా ఖండించారు.
TDP Leader Comments on CM Jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్.. గొప్పనాయకుడిపై అక్రమంగా కేసులు పెట్టించారని సుహాసిని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ తగ్గించలేరని ఆమె చెప్పారు. ప్రజల మీద తప్పుడు కేసులు బలవంతంగా పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుహాసిని పేర్కొన్నారు. ఆయనని క్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలు సుహాసినితో ముఖాముఖి.