Telangana TDP Leaders Protest Against Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణలో హోరెత్తిన నిరసనలు - తెలంగాణ టీడీపీ నేతలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 9:24 PM IST

Telangana TDP Leaders Protest Against Chandrababu Arrest : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టుకి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా అరెస్టు చేసి.. జైల్లో పెట్టారంటూ ఆందోళనలతో హోరెత్తించారు. పలు చోట్ల బాబుకి మద్దతుగా.. రిలే నిరహార దీక్షలు నిర్వహించారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుని అరెస్టు చేశారంటూ నిరసన కారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టుని(Chandrababu Arrest) నిరసిస్తూ శ్రేణులు.. హైదరాబాద్‌లో మౌన ప్రదర్శన చేపట్టారు. ట్యాంక్‌ బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి.. నల్ల జెండాలను ఎగురవేశారు. దాదాపు గంటసేపు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన(TDP Leaders) నేతలు.. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్​కి చేరుకుని నివాళులు అర్పించారు. మౌన ప్రదర్శనలో నందమూరి సుహాసిని పాల్గొన్నారు. 

Nizamabad TDP Leaders Protest CBN Arrest : చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఏపీ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని.. శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగిరి మండలం ఎత్తోండలో స్థానికులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. భారీగా పాల్గొన్న యువత.. చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన దీక్ష నిర్వహించారు. చంద్రబాబుకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే జగన్‌ అక్రమ కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.