Teacher Slapped Student 35 Times : హోంవర్క్ చేయలేదని బాలికపై టీచర్ దారుణం.. 35సార్లు.. - హోంవర్క్ చేయలేదని 4 ఏళ్ల బాలికపై టీచర్ దాడి
🎬 Watch Now: Feature Video


Published : Oct 11, 2023, 6:26 PM IST
Teacher Slapped Student 35 Times : గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు నాలుగేళ్ల విద్యార్థిని పట్ల అత్యంత పైశాచికంగా ప్రవర్తించింది. హోంవర్క్ సరిగ్గా చేయలేదనే కారణంతో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 35 సార్లు ఆ చిన్నారిని వీపు కమిలేలా కొట్టింది. ఈ దృశ్యాలన్నీ తరగతి గదిలో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సూరత్‌లోని పునాగం ప్రాంతంలో ఉన్న సాధన నికేతన్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలాగే స్కూల్ నుంచి వచ్చిన తమ చిన్నారికి యూనిఫాం మారుస్తున్న సమయంలో ఆమె వీపుపై టీచర్ దెబ్బలు కొట్టినట్లు గుర్తించానని బాలిక తల్లి తెలిపింది. ఇదే విషయమై పాఠశాలకు వెళ్లి టీచర్‌ను నిలదీయగా కేవలం ఒక్కటే దెబ్బ కొట్టానని ఆమె బుకాయించినట్లు బాలిక తండ్రి చెప్పారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన బాధిత బాలిక తల్లిదండ్రులు క్లాస్‌రూంలోని సీసీటీవీ దృశ్యాలను బయట పెట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ ఫుటేజీలో టీచర్ చిన్నారిని 35 సార్లు కొట్టినట్లుగా స్పష్టంగా కనిపించింది. దీంతో సంబంధిత టీచర్‌ను విధుల నుంచి తొలగించింది పాఠశాల యాజమాన్యం.