TDP woman leader Kambhampati Sirisha was severely beaten by police పోలీసుల విచక్షణారహిత దాడి.. రక్తపు వాంతులు చేసుకున్న కంభంపాటి శిరీష - TDP Woman Leader Sirisha Lathi Charged By Police
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2023, 8:23 PM IST
TDP Woman Leader Kambhampati Sirisha Lathi Charged By Police: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల పట్ల పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. నిరసన తెలుపుతున్న కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి, తీవ్రంగా కొట్టారు. మరికొన్ని చోట్ల నడిరోడ్డుపై కిందపడేసి..కార్యకర్తల గొంతును మోకాలితో తొక్కిపట్టారు. ఈ ఘటనలలో ఊపిరాడని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. వదిలిపెట్టాలంటూ పోలీసులను వేడుకున్నారు.
తెలుగుదేశం మహిళా నేతపై పోలీసులు లాఠీఛార్జ్.. మరోవైపు గుంటూరు జిల్లాలోని మిర్చి యార్డు వద్ద చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. నిరసన తెలుపుతున్న తెలుగుదేశం మహిళా నేత కంభంపాటి శిరీషపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి, తీవ్రంగా కొట్టారు. దాంతో ఆమె నడవలేని స్థితికి చేరుకుంది. అంతేకాకుండా, పోలీసులు లాఠీలతో తీవ్రంగా కొట్టడంతో.. ఆమె రక్తపు వాంతులు చేసుకున్నారు. అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు.. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తెలుగుదేశం మహిళా నేత కంభంపాటి శిరీషపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.