TDP Narayana Mualakat CBN : 'ఎంఎస్ స్వామినాథన్​కు చంద్రబాబు సంతాపం'.. చంద్రబాబు జైలులో ఉన్నా జనం గురించే ఆలోచన - Inner Ring Road

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 1:51 PM IST

TDP Narayana Mualakat CBN :  రాజమండ్రి జైలులో చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్‌ అయ్యారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు కోడలు బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు వారు మాట్లాడుకున్నారు. చంద్రబాబు క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జైలు బయట నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు కుట్రపూరితమని అందరికీ తెలుసు అని అన్నారు. 'చంద్రబాబు జైలులో ఉన్నా ప్రజల గురించి ఆలోచిస్తున్నారని, ఎంఎస్ స్వామినాథన్ మృతి విషయాన్ని తెలుసుకుని... సంతాపం తెలియజేశారు. ఈ విషయాన్ని నా ద్వారా మీడియాకు చెప్పమని అన్నారు. తనకు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్న తెలుగుదేశం సహా ఇతర అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.' అని వెల్లడించారు. కోర్టులో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 2001లో కొన్న తన భూమి కూడా రింగ్‌రోడ్డులో పోయిందని నారాయణ తెలిపారు. కోల్పోయిన భూమి విలువ దాదాపు దాదాపు ఏడు కోట్లుని,  రూ.7 కోట్ల విలువైన నా భూమే పోగొట్టుకున్నా.. నేను అవినీతికి పాల్పడతానా? అని నారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాం అని నారాయణ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.