"పల్లె.. పల్లెకి వస్తున్నాడమ్మో..".. లోకేశ్ యువగళం పాదయాత్రపై స్పెషల్ సాంగ్
🎬 Watch Now: Feature Video
SONG ON LOKESH YUVAGALAM: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. 2023 జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర.. నేటికీ 57వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్‌కు వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్యలను ఓపికగా వింటున్న లోకేశ్.. టీడీపీ అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు. పాదయాత్రకు మహిళలు, చిన్నారులు తరలివస్తున్నారు. హారతులు, గజమాలలతో జననీరాజనాలు పడుతున్నారు. తాజాగా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీ నేత కేశినేని చిన్ని ప్రత్యేక గీతం రూపొందించారు. ఈ పాటను లోకేశ్ క్యాంప్ సైట్ ప్యాదిండి వద్ద విడుదల చేశారు. యువగళం పాదయాత్ర ద్వారా లోకేశ్ కొత్త నాయకుడిగా ప్రజల ముందుకు వస్తున్నారని కేశినేని చిన్ని తెలిపారు. ఈ పాటను లోకేశ్ తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణికి అంకితం చేస్తున్నామని చిన్ని పేర్కొన్నారు.