TDP Introduce AI Anchor Vaibhavi: టీడీపీ కొత్త ప్రయోగం.. ఏఐ యాంకర్ వైభవితో యువగళంషెడ్యూల్ - Artificial intelligence Anchor Vaibhavi
🎬 Watch Now: Feature Video

AI Anchor Vaibhavi Read Yuvagalam Schedule : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో టీడీపీ నాయకులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏఐ టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్‌తో వార్తలు చదివేలా టీడీపీ సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసింది. ఈ ప్రయోగం ద్వారా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం షెడ్యూల్‌ను వివరించింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 159వ రోజు జరిగే కార్యక్రమాలను కృత్రిమ యాంకర్ వైభవి వార్తలు చదివింది. ఇక నుంచి యువగళం అప్డేట్స్ ఇచ్చేలా కృత్రిమ యాంకర్ వైభవితో వార్తలు చదివించి.. అనంతరం వీడియోలు విడుదల చేయనున్నారు. టీడీపీ అనుబంధ విభాగం ఐ-టీడీపీ ద్వారా ద్వారా నూతన విధానానికి రూపకల్పన చేసినట్లు టీడీపీ నాయకులు వివరించారు. ఏఐ టెక్నాలజీ ద్వారా పార్టీ కార్యక్రమాలపై ప్రచారం సాగించే ఆలోచనలో టీడీపీ ఉంది. మేనిఫెస్టో సహా పార్టీ కార్యక్రమాలు, అప్డేట్స్ ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల చరిత్రలో తొలి ఏఐ యాంకర్ ఆలోచన తమదేనని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.