Taekwondo Championship in Yadadri : భువనగిరిలో ఘనంగా జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 1, 2023, 8:53 PM IST
Taekwondo Tournament in Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లాలో 8వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించారు. భువనగిరి పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో వీటిని ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో 80 మంది తైక్వాండో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Taekwondo Competition in Yadadri District : విద్యార్థులు ప్రత్యర్థులను కాలిత్ కిక్ చేస్తూ.. తన యాక్షన్ స్కిల్స్‌ను ప్రదర్శించారు. చిన్నారుల నుంచి సీనియర్ల వరకు నిర్వహించిన పోటీలు ఆహుతులను అబ్బుర పరిచారు. పోటాపోటీగా జరిగిన ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో తైక్వాండో మాస్టర్లు కృష్ణ, రాధా, పరమేష్ తో పాటు ఇతర మాస్టర్లు పాల్గొన్నారు. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఇలాంటి విద్యలు నేర్చుకోవడం ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉంటే తమను తాము రక్షించుకోవడమే కాకుండా పోకిరీలకు బుద్ధి కూడా చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు.