ప్లాస్టిక్ బాక్స్‌ను మింగేసిన పాము.. హుటాహుటిన ఆస్పత్రికి.. సర్జరీ సక్సెస్! - పాముకు సర్జరీ చేసి ప్లాస్టిక్ డబ్బా తొలగింపు
🎬 Watch Now: Feature Video
Cobra Swallows Plastic Box : ప్లాస్టిక్ డబ్బాను మింగేసిన నాగుపాముకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు ఓ పశు వైద్యుడు. పాము కడుపులో నుంచి ప్లాస్టిక్ డబ్బాను తొలగించి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన కర్ణాటక.. దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరులో జరిగింది.
కమలపాడు గ్రామ పంచాయతీ సభ్యురాలు వసంతి ఇంటి ఆవరణలో ఓ నాగు పాము గాయాలతో జూన్ 4న ఆమె కుటుంబ సభ్యులకు కనిపించింది. జూన్ 6న ఆమె కుటుంబ సభ్యులు.. పాముల సంరక్షకుడు స్నేక్ కిరణ్‌కు సమాచారం అందించారు. వెంటనే కిరణ్ ఘటనాస్థలికి చేరుకున్నాడు. పాము తల కింది భాగంలో గాయాలైనట్లు గుర్తించాడు. వెంటనే నాగు పాముకు వైద్యం కోసం మంగళూరు వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పాము కడుపు వాచి ఉండడాన్ని గమనించిన ఆస్పత్రి వైద్యుడు యశస్వీ నారవి.. పాముకు ఎక్స్‌రే తీశారు. అందులో నాగు పాము కడుపులో ప్లాస్టిక్ పదార్థం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే నాగుపాముకు సర్జరీ చేసి.. దాని కడుపులో ఉన్న ప్లాస్టిక్ డబ్బాను తొలగించారు. శస్త్ర చికిత్స అనంతరం నాగు పామును 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాము కోలుకున్నాక ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు స్నేక్ కిరణ్.