Food Festival: ఐపీఎల్ థీమ్‌తో ఫుడ్ పెస్టివల్
🎬 Watch Now: Feature Video
Food Festival in Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఐపీఎల్ థీమ్‌తో రీజెన్సీ కాలేజీ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఫుడ్ పెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యువ మహిళా క్రికెటర్ గొంగడి త్రిష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో రోజు రోజుకు మహిళా క్రికెట్‌కు మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. అండర్ 19 ఉమెన్ వరల్డ్ కప్ జట్టులో సభ్యురాలుగా ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా క్రికెటర్లకు మరింతగా చేయూత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా త్రిషను కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది ఘనంగా సత్కరించారు. కళాశాల వార్షికోత్సవం అయినందున విద్యార్థులకు ఐపీఎల్ థీమ్‌పై ఆహారపు పోటీలను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో దాగియున్న నైపుణ్యంతో పాటు వారికి ప్రాక్టికల్‌గా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. క్రికెట్ స్టేడియం, పిచ్, క్రికెట్ బాల్స్, బ్యాట్స్ థీమ్స్‌తో హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు 100 రకారకల ఫుడ్స్‌ను వండి ప్రదర్శన చేశారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాలైన ఆహారపు రుచులను త్రిష ఆస్వాదించి అభినందించారు.