అటుకులపై 30 దేశాల జాతీయ జెండాలు పెయింటింగ్- 30 సెకన్లలో వేసి విద్యార్థిని రికార్డ్ - flags of 30 countries on flattened rice

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 3:01 PM IST

Student Paints Flags of 30 Countries on Flattened Rice : సాధారణంగా పేపర్​పై పెయింటింగ్ వేసేవారిని చూస్తుంటాం. కానీ అటుకులపై పెయింటింగ్ వేయడం మీరు ఎప్పుడైనా చూశారా? అసోంకు చెందిన ఓ విద్యార్థిని మాత్రం అటుకులపై 30 దేశాల జాతీయ జెండాలను వేసింది. ఆ విద్యార్థిని ప్రతిభకు ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో చోటు దక్కింది.  

అసోంకు చెందిన మౌ దాస్​ అనే విద్యార్థినికి.. ఓ రోజు భోజనం చేసే సమయంలో అటుకులుతో ఏదైనా పెయింటింగ్ వేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఈ క్రమంలోనే అటుకులపై 30 దేశాల జాతీయ జెండాలను పెయింటింగ్ వేయాలని అనుకుంది. తన ఆలోచనకు ఆచరణ తోడయ్యింది. కేవలం 30 సెకన్ల అతితక్కువ సమయంలోనే వివిధ దేశాలకు చెందిన జాతీయ పతాకాలను పెయింటింగ్ వేసింది. ఫలితంగా ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో మౌ దాస్​కు స్థానం దక్కింది.

నేను కఛాడ్​ జిల్లాలోని సిల్చార్​ ప్రాంతంలో నివాసం ఉంటున్నాను. ఒక రోజు భోజనం చేస్తున్నపుడు నాకు అటుకులపై వివిధ దేశాల జాతీయ పతాకాలు పెయింటింగ్ వేయాలనే ఆలోచన వచ్చింది.వెంటనే ప్రయత్నించి జెండాలను వేయగా.. ఈ గుర్తింపు దక్కింది.
-మౌ దాస్, విద్యార్థిని

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.