Snakes Found In Home Viral Video : ఒకే ఇంట్లో 30 పాములు కలకలం.. ఒక్కొక్కటిగా బయటకు వస్తూ.. - అసోంలోని ఓ ఇంట్లో 30 నాగు పాములు వీడియో
🎬 Watch Now: Feature Video
Published : Aug 27, 2023, 10:20 AM IST
|Updated : Aug 27, 2023, 11:38 AM IST
Snakes Found In Home Viral Video : అసోం.. జోర్హట్ జిల్లాలో ఒకే ఇంట్లో 30 పాములు కనిపించడం కలకలం రేపింది. మరియానీ ప్రాంతంలోని హతిజురి టీ ఎస్టేట్‌లో ఉన్న ఓ ఇంట్లో ఈ పాములు బయటపడ్డాయి. భయాందోళనకు గురైన కుటంబసభ్యులు పాముల సంరక్షుడిని పిలిపించారు.
ఇదీ జరిగింది..
Snakes Viral Video : హతిజురి టీ ఎస్టేట్‌లో శంకర్ బనియా అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. వీరి ఇంట్లో ఓ నాగు పాము సంచరించింది. దాన్ని గుర్తించిన శంకర్ కుటుంబీకులు.. కొద్ది రోజుల క్రితం బయటకు తరిమికొట్టారు. అయితే ఆ పాము మళ్లీ ఇంట్లోకి వచ్చి.. ఓ గదిలోని ఫ్లోర్ కింద గుంతలోకి దూరి పిల్లలు చేసింది. శుక్రవారం ఆ గదిలోంచి పాము పిల్లలు ఒక్కొక్కటి బయటకు రావడం శంకర్ కుటుంబీకులు చూశారు. వాటిని కూడా తరిమికొట్టారు. అయితే శనివారం కూడా అలాగే పాము పిల్లలు బయటకు రావడం వల్ల భయాందోళనకు గురై.. పాముల సంరంక్షుడిని పిలిపించారు. స్థానికంగా పాములు పట్టే నిపుణుడిగా పేరుగాంచిన అనిల్ తాసా అనే వ్యక్తి.. గదిలోని ఫ్లోర్‌ను తవ్వి 'చక్రి ఫేటీ' (కోబ్రా డి కాపెల్లో)గా పిలువబడే 30 నాగు పాము పిల్లలను రక్షించాడు. వాటిని అటవీ శాఖకు అప్పగిస్తానని తెలిపాడు.