'ఎలుకల మందు తిని పాముకు అస్వస్థత'.. బాటిల్తో నీళ్లు తాగిస్తే.. - snake rescue video
🎬 Watch Now: Feature Video
Man Gives Water To Snake : ఎలుకల మందు తిని అస్వస్థతతకు గురైన ఓ పాముకు వాటర్ బాటిల్తో నీళ్లు పట్టి కాపాడాడు ఓ సామాజిక కార్యకర్త. ఈ తర్వాత ఆ పామును సురక్షిత ప్రదేశంలో వదిలేశాడు. ఈ ఘటన తమిళనాడు.. కడలూరు జిల్లాలోని తిరుచోపురంలో జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
Snake rescue video : తిరుచోపురం గ్రామానికి చెందిన నటరాజన్ అనే వ్యక్తి ఇంటి తలుపు వద్దకు ఓ పాము వచ్చింది. అది అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయేలా ఉంది. వెంటనే నటరాజన్.. పాము సంరక్షకుడు, సామాజిక కార్యకర్త సెల్వకు సమాచారం అందించాడు. పామును ఎలాగైనా రక్షించాలని సెల్వను కోరాడు. ఘటనాస్థలికి చేరుకున్న సెల్వ.. పాముకు వాటర్ బాటిల్తో నీళ్లను అందించాడు. అప్పుడు.. మెల్లగా పాము కోలుకుంది. కాసేపటి తర్వాత సెల్వ.. పామును సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టాడు. దీంతో తిరుచోపురం గ్రామస్థులు.. సెల్వపై ప్రశంసలు కురిపించారు. 'ఇంట్లో ఎలుకలు మందు పాము తిని ఉండొచ్చు. అందుకే ఆ పాము తీవ్ర అస్వస్థతతకు గురైంది.' అని సెల్వ అన్నాడు.