స్కూల్ షూలో నాగుపాము- భయంతో బాలుడి పరుగులు- చివరకు? - తమిళనాడులో విద్యార్థి షూలో పాము
🎬 Watch Now: Feature Video
Published : Nov 10, 2023, 11:42 AM IST
Snake In School Shoes : తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలోని వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో గురువారం ఓ నాగుపాము కలకలం సృష్టించింది. 8వ తరగతి చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థి స్కూల్ బూటులోకి దూరింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు భాయాందోళనకు గురయ్యారు.
ఇదీ జరిగింది..
స్కూల్ షూస్ వేసుకునేందుకు ఇంట్లోని చెప్పుల స్టాండ్లో ఉంచిన బూట్ల దగ్గరకు వెళ్లాడు ప్రదీప్ అనే బాలుడు. అక్కడ అతడికి బుసలు కొడుతున్న ఓ శబ్దం వినిపించింది. ఏంటా అని చూస్తే ఓ షూలో పాము పడుకొని ఉన్నట్లు గమనించాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం ఫోన్ ద్వారా వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ సిబ్బందికి తల్లిదండ్రులు సమాచారం అందించారు. ఫౌండేషన్ సిబ్బంది.. మోహన్ అనే స్నేక్ ఎక్స్పర్ట్ను ఘటనా స్థలికి పంపారు. అతడు చాకచక్యంగా దానిని చిన్నపాటి ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. అనంతరం పామును సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. తాము పట్టకున్న పాము కోబ్రా జాతికి చెందినదిగా చెప్పాడు మోహన్.