Snake in Food ECIL Company : ఈసీఐఎల్ కంపెనీ మధ్యాహ్న భోజనంలో పాము... ఆందోళనలో ఉద్యోగులు - తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video
Snake in Food At ECIL Company Hyderabad : అబ్బా ఆకలిగా ఉంది మంచిగా తిందాం అనుకున్న ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైంది. తినే ఆహారంలో ఒక్కసారిగా పాము కళేబరం రావడంతో షాక్ అయ్యారు. ఈ ఘటన చర్లపల్లి ఈఎస్ఎండీ కంపెనీవో చోటుచేసుకుంది. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటిన్ నుంచి వండిన వంటను చర్లపల్లిలోని ఈఎంఎస్డీ సంస్థకి మధ్యాహ్నం భోజనం ఏర్పాడు చేస్తారు. రోజులాగే శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎం క్యాంటిన్లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పులో నుంచి పాము పిల్ల కళేబరం బయటపడింది. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పప్పులో విషసర్పం రావడంతో కంపెనీలో పని చేస్తున్న కార్మికులు విషసర్పం వెలువడిన ఆహారం తీసుకోవడంతో కొంతమంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కంపెనీ అధికారులు విషయాన్ని బయటకి రానివ్వకుండా ఉంచారనే అభియోగంతో చర్లపల్లిలోని ఈయంఎస్డీ కంపెనీలో నైట్ డ్యూటీకి వచ్చిన కార్మికులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. కంపెనీ యాజమాన్యం ఎవరికి తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచి అస్వస్థతకు గురైన కార్మికులకు కంపెనీలోనే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇచ్చి ఇంటికి పంపారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. బయటకి చెబితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. పాము వచ్చిన భోజనం తిన్న కొంత మంది కార్మికులు పగలు డ్యూటీ ముగిసిన తరువాత బయటకు వచ్చి విషయాన్ని నైట్డ్యూటీకి వచ్చే కార్మికులకు చెప్పడంతో కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు.