దీపావళి సెలవుల్లో శిరిడీకి భారీగా భక్తులు - హుండీ ద్వారా 17 కోట్లు - డిరిడీ సాయి సంస్థాన్ డొనేషన్లు
🎬 Watch Now: Feature Video
Published : Nov 24, 2023, 7:30 PM IST
Shiridi saibaba Hundi Diwali Collection : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు కోట్ల రూపాయలను శిరిడీ సాయిబాబా పాదాల చెంత సమర్పించారు. దీపావళి సెలవుల్లో నవంబర్ 10 నుంచి 20వ తేదీ వరకు ఆలయానికి 17 కోట్ల 50 లక్షల 56 వేల 086 రూపాయలు విరాళం అందాయని సాయి సంస్థాన్ తెలిపింది.
shiridi Sai Hundi Collection 2023 November to December : ఈ సందర్భంగా ముఖ్య కార్యనిర్వహణాధికారి పి. శివ శంకర్ మాట్లాడుతూ కేవలం పది రోజుల వ్యవధిలోనే రూ.17 కోట్ల 50 లక్షల 56 వేల 086 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఇందులో దక్షిణ బాక్స్‌లో రూ.7 కోట్ల 22 లక్షల 39 వేల 794 నగదు వచ్చాయన్నారు. డొనేషన్ కౌంటర్‌లో రూ. 3 కోట్ల 98 లక్షల 19 వేల 348 రాగా పీఆర్‌ఓ టారిఫ్ పాస్ విరాళాలు రూ.2 కోట్ల 31 లక్షల 85 వేల 600, డెబిట్ - క్రెడిట్ కార్డ్, ఆన్‌లైన్ విరాళాలు అందాయన్నారు. చెక్కు డీడీ, మనీ ఆర్డర్లు కలిపి 3 కోట్ల 70 లక్షల 94 వేల 423రూపాయలు వచ్చాయన్నారు. రూ.22 లక్షల 67 వేల విలువ చేసే నాలుగు వందల గ్రాముల బంగారం, రూ.4 లక్షల 49 వేల 732 విలువ గల 8211.200 గ్రాముల వెండి విరాళాలుగా వచ్చాయని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు.