డిసెంబరు 3న ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పడబోతుంది : షబ్బీర్ అలీ - షబ్బీర్ అలీ లెటెస్ట్‌ కామెంట్స్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2023, 9:22 PM IST

Shabbir Ali Statement On Congress Winning : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని అందుకే కుటుంబపాలన సాగిస్తున్న బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. ఈనెల 3న ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పడబోతోందని.. తమది సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. నిజామాబాద్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలింగ్ సరళిపై మాట్లాడారు. దొర అరాచక నియంత పాలనపై విసుగు చెందిన ప్రజలు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కే పట్టం కట్టబోతున్నారని తెలిపారు. 

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తుందని చెబుతున్నాయన్నారు. 25 సీట్లకంటే ఎక్కువ బీఆర్ఎస్‌కు రావని.. ఇదే విషయాన్ని, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పారని తెలిపారు. దీపం ఆరిపోయే ముందు వెలిగినట్టు ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని కేటీఆర్‌ చెబుతున్నాడని పేర్కొన్నారు. కేసీఆర్ నిన్న మీడియా ముందుకు రాకుండా ఓటమిని అంగీకరించారని చెప్పారు. తమకు మెజారిటీ, మైనార్టీ అనే భావన లేదని.. మనమంతా భారతీయులమని చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.