స్కూల్ టాయిలెట్లో 7 అడుగుల మొసలి.. రెండు గంటలు శ్రమించి..
🎬 Watch Now: Feature Video
రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడు అడుగుల పొడవైన మొసలి కనిపించడం కలకలం రేపింది. స్కూల్లోని టాయిలెట్లో ఈ భారీ మొసలి కనిపించింది. ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని నాగ్లా పాసీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్థులు మొసలిని గమనించి బెదిరిపోయారు. భారీ సైజులో ఉన్న మొసలిని చూసి ఆందోళన చెందారు. టాయిలెట్లో మొసలి నక్కి ఉండటాన్ని చూసి.. దాని జోలికి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొసలిని తీసుకెళ్లిపోవాలని కోరారు. వెంటనే వణ్యప్రాణి సంరక్షణ బృందాలతో కలిసి అటవీ అధికారులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. దాన్ని ఓ ఇనుప బోనులో బంధించి తీసుకెళ్లారు. గోపాల్‌పుర్ కెనాల్లో మొసలిని విడిచిపెట్టినట్లు అటవీ శాఖ అధికారి సురేంద్ర కుమార్ సారస్వత్ వెల్లడించారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల స్కూల్లో విద్యార్థులు ఎవరూ లేరని స్థానికులు చెబుతున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైందని అంటున్నారు.