Gauravelli Project In Siddipet : గౌరవెల్లి ప్రాజెక్టు మోటార్ పంపు రెండో ట్రయల్ రన్ సక్సెస్ - Gauravelli project in siddipet

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 29, 2023, 3:43 PM IST

Second Trial Run Of Gauravelli Project Motor Pump : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు మోటార్ పంపు రెండో ట్రయల్ రన్​ను ఎమ్మెల్యే సతీష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. పంప్ హౌస్ డెలివరీ సిస్టం నుంచి ప్రాజెక్టులోకి పరవాళ్లు తొక్కుతున్న గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండో ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని, హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా 62,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పది రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించి, లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. 95 శాతం భూ నిర్వాసితులు అడిగింది నెరవేర్చమని, ప్రాజెక్టు ద్వారా మొత్తం 1,06,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కేసీఆర్​ వల్లే తెలంగాణ ఈరోజు నీటి సమస్యల నుంచి బయటపడిందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.