Ind vs Aus 4th Test 2024 : బాక్సింగ్ డే టెస్టులో భారత్‌కు షాక్ తగిలింగి. ఐదు రోజుల పాటు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో ఆసీస్ 184 పరుగుల తేడాతో నెగ్గింది. 340 పరుగుల లక్ష్య ఛేదనలో దిగిన భారత్ 155 పరుగులకు ఆలౌటైంది. యశస్వీ జైస్వాల్ (84 పరుగులు) ఒక్కడే రాణించాడు. రిషబ్ పంత్ (30 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లెవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, స్కాట్ బొలాండ్ చెరో 3, లియాన్ 2, స్టార్క్, హెడ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. దీంతో 5 టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 2-1తో లీడ్‌లోకి దూసుకెళ్లింది.
ఇరు జట్లు స్కోర్లు
- ఆస్ట్రేలియా- 474 & 234
- భారత్- 369 & 155
తాజా ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ అవకాశాలు దాదాపు గల్లంతు అయ్యాయి. ఇక చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గితే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.