ETV Bharat / state

ఐడియా అదిరింది - బొమ్మ బాగా కుదిరింది - 4 కోతుల హోర్డింగ్​లు భలే ఉన్నాయే! - AP GOVT CAMPAIGN USE SOCIAL MEDIA

సోషల్‌ మీడియా వాడకంపై ఏపీ ప్రభుత్వం వినూత్న ప్రచారం - పోస్ట్‌ నో ఈవిల్‌ అంటూ హోర్డింగ్‌ బోర్డులు

AP Government Innovative Campaign On The Use Of Social Media
AP Government Innovative Campaign On The Use Of Social Media (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 7:43 AM IST

Updated : Dec 30, 2024, 9:41 AM IST

AP Government Innovative Campaign On The Use Of Social Media : 'సోషల్‌ మీడియాను మంచి కోసం వాడుదాం అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్తి పలుకుదాం' అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది. చెడు కనకు, అనకు, వినకు అనే సూక్తి చాటి చెప్పే మూడు కోతుల బొమ్మకు అదనంగా ఇంకో కోతిని జత చేస్తూ, చెడు పోస్ట్‌ చేయకు (పోస్ట్‌ నో ఈవిల్‌) అంటూ ఈ హోర్డింగ్‌లతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

Hordings
హోర్డింగ్‌ బోర్డులు (ETV Bharat)

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే వస్తున్న సమాచారం సరైందా లేదా అని నిర్ధారించుకోకుండా వాటిని షేర్‌ చేయడం వల్ల ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. అలాగే రోడ్డుమీద, ఎక్కడైన ఏవైన సంఘటనలు జరిగినప్పుటు తోటి మనిషిగా సహాయం చేయకపోగా వాటిని ఫోన్లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటారు. అవి చూసిన నెటిజన్లు వాళ్ల భావాలను వ్యక్త పరుస్తున్నారు.

AP Government Innovative Campaign On The Use Of Social Media
విజయవాడలో ఆటోపై పోస్టర్‌ (ETV Bharat)

షార్ట్ వీడియోలతో రూ.లక్షల్లో ఆదాయం! - సోషల్​మీడియాలో దూసుకెళ్తున్న బెజవాడ యువత

మరీ ముఖ్యంగా ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి గురించి చెప్పనవసరం లేదు. ఇష్టారీతిన రాసి స్ప్రడ్‌ చేస్తున్నారు. అందు నిజమెంతా అని తెలుసుకొని ప్రజలు ఇతరులకు చెప్తున్నారు. మరోవైపు యువతు సోషల్‌ మీడియా రీల్స్‌ మోజులో పడి కొందరు కేసుల్లో ఇరుక్కుంటుంటే మరి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ నిజానికి ఒక మనిషిని స్టార్‌ చేయాలన్నా, ఒకరిని పాతాళానికి పంపించాలన్నా సోషల్‌ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలా చాలామంది ప్రతిభను బయటకు తీసి జీవితాన్ని ఇచ్చింది.

తాడేపల్లిలోని జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో దారి పొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు (ETV Bharat)

ఆవే సామాజిక మాధ్యమాలు పిల్లలను చెడుదారులు తొక్కించి ప్రాణాలు సైతం పోగొట్టుకునేలా చేస్తున్నాయి. ఒకప్పుడు ఇంటర్నెట్‌ అనేది పెద్ద విషయం. కేవలం అవసరమైన సమాచారం కోసమే వాడేవారు. అలాంటిది ఇప్పుడు అదో చిన్నామాట. స్కూల్‌ పిల్లల నుంచి ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌ వాడుతున్నారు. దీనిపై ఆలోచించిన ప్రభుత్వ తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

సోషల్​ మీడియాలో అలాంటి పోస్టులు షేర్ చేస్తే చిప్పకూడే - బీ కేర్​ ఫుల్

Last Updated : Dec 30, 2024, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.