పెళ్లి ఊరేగింపులో విషాదం.. డ్యాన్స్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన స్కార్పియో.. 31 మంది.. - డ్యాన్స్ వేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
🎬 Watch Now: Feature Video
ఎంతో ఆనందంగా కొనసాగుతున్నపెళ్లి ఊరేగింపులో విషాదం నెలకొంది. డ్యాన్స్ చేస్తున్న వారిపైకి ఓ స్కార్పియో ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. 31 మంది గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది.
బిజ్నోర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఐదుగురు వ్యక్తులు సహరాన్పుర్కు తిరిగి కారులో పయణమయ్యారు. ఈ క్రమంలోనే రాత్రి 12 గంటల సమయంలో బహదరాబాద్లోని రహదారి పక్కన పెళ్లి ఊరేగింపు నిర్వహిస్తున్న వారిపైకి అతి వేగంగా ప్రయాణిస్తున్న ఆ కారు దూసుకెళ్లింది. వారిని ఢీకొట్టిన తర్వాత ఆ స్కార్పియోను కొద్ది దూరంలో ఆపారు. వెంటనే కారు వద్దకు చేరుకున్న పెళ్లి బృందం అందులో ఉన్న వారిని బయటకు లాగి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పెళ్లి బృందం చేతిలో గాయపడిన కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కారులో ఉన్న వారంతా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. స్కార్పియో డ్రైవర్ సహరాన్‌పుర్ జిల్లాకు చెందిన భారతీయ కిసాన్ యూనియన్ కార్యదర్శిగా పోలీసులు గుర్తించారు.