షిర్డీలో ఘనంగా సాయిలక్ష్మీ యజ్ఞం - వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న 101 మంది భక్తులు - sai lakshmi yagam

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 8:53 PM IST

Sai Lakshmi Yagam in Shirdi: షిర్డీలో సాయిలక్ష్మీ యజ్ఞం ఘనంగా జరిగింది. సాయి భక్తురాలు అయిన లక్ష్మీబాయి షిండే ట్రస్ట్‌ తరఫున గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో దేశ, విదేశాల నుంచి సాయి భక్తులు పాల్గొంటారు. ఈ ఏడాది 101 మంది సాయి భక్తులు ఈ యజ్ఞానికి హాజరయ్యారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున సాయిబాబా భక్తురాలు అయిన లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ తరఫున ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. 

సాయిబాబా తన చివరి క్షణాల్లో తన భక్తురాలు అయిన లక్ష్మీబాయి షిండేకి తొమ్మిది నాణేలను ఇచ్చారు. లక్ష్మీబాయి షిండే ట్రస్ట్‌ తరుఫున ప్రతి సంవత్సరం ఈ యజ్ఞం జరుగుతుంది. యాగం కోసం తొలుత నిప్పును తయారు చేస్తారు. పూజారులు కర్రలను మండించి పురాతనమైన పద్ధతి ద్వారా నిప్పును పుట్టిస్తారు. దేశంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని షిర్డీలోని లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ తరఫున యజ్ఞం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యజ్ఞంలో దేశ, విదేశాల నుంచి సాయి భక్తులు షిర్డీకి వచ్చి సాయిలక్ష్మీ యజ్ఞంలో పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.