బుల్లెట్ బైక్‌కు మంటలు... చూస్తుండగానే పూర్తిగా.. - బుల్లెట్ బైక్ అగ్నిప్రమాదం
🎬 Watch Now: Feature Video
Royal Enfield caught fire: తమిళనాడు చెన్నైలో ఓ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ బుధవారం మంటల్లో కాలిపోయింది. వల్లువార్ కొట్టం రోడ్‌పై వెళ్తున్న వాహన చోదకుడు.. బైక్ వేడెక్కడాన్ని గమనించాడు. వెంటనే రోడ్డు పక్కన బైక్‌ను ఆపేశాడు. ఈ క్రమంలోనే బైక్‌లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్లో నుంచి నీటిని తీసుకొచ్చి బైక్‌పై పోశారు. మంటలను అదుపులోకి తెచ్చారు. నుంగంబక్కం అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పేశారు. వాహనదారుడు ఈ బుల్లెట్ బండిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు తెలిసింది. తన స్టోర్ నుంచి ఇంటికి వెళ్తుండగా మంటలు చెలరేగాయని వాహనదారుడు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST