మూడు వాహనాలను ఢీకొట్టి.. షాపులోకి దూసుకెళ్లిన జీపు - కేరళలో రోడ్డు ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 2, 2023, 10:37 PM IST

Updated : May 2, 2023, 10:51 PM IST

వేగంగా వస్తున్న జీపు.. అదుపు తప్పి  కారు, స్కూటీ, బైక్​ను ఢీ కొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కేరళలోని పతనంతిట్టలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ రికార్డయ్యాయి.

ఘటనలో స్కూటీ రైడర్​​ ఆర్య, బైకర్​ బిలాక్షన్​, జీపు డ్రైవర్​ గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు.. బాధితులందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా చెంగన్నూరులోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో బిలాక్షన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు కారణమైన జీపు.. పంతాళం నుంచి అదూర్​ వైపుగా వెళుతోంది. దీన్ని ఒక ప్రైవేటు డాక్టర్​ డ్రైవ్​ చేస్తున్నారు. ప్రమాదం అనంతరం జీపు నేరుగా ఓ షాపులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో షాపులో ఎవ్వరు లేని కారణంగా మరింత ప్రమాదం తప్పింది.

Last Updated : May 2, 2023, 10:51 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.