దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోరం- రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు మృతి - పంజాబ్ రోడ్డు ప్రమాదం న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Nov 2, 2023, 1:30 PM IST
|Updated : Nov 2, 2023, 1:59 PM IST
Road Accident in Punjab : పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డారు. ట్యాంకర్ను ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించిన ఓ కారు.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. కారులో ఉన్న వ్యక్తులు దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
జిల్లాలోని సుమాన్ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు కారులో మలేర్కోట్లకు దైవదర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ముందు వెళ్తున్న ట్యాంకర్ను ఓవర్టేక్ చేసేందుకు వాళ్ల కారు యత్నించింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. మరణించిన వారంతా సుమాన్ ప్రాంతానికి చెందినవారేనని వెల్లడించారు.