Revanth Reddy: కంటతడి పెట్టిన రేవంత్.. ఈటల ఆరోపణ నా మనోవేదనను దెబ్బతీసేలా ఉందంటూ..! - భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం వద్ద రేవంత్‌రెడ్డి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18321550-161-18321550-1682175735827.jpg)
Revanth Reddy fire on Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలపై చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రమాణం చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఒకానొక సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంట తడి పెడుతూ.. 'నా కళ్లలో నీళ్లు రప్పించావు.. కేసీఆర్ సర్వం దారబోసినా రేవంత్‌రెడ్డిని కొనలేరు. ప్రశ్నించే గొంతుపై దాడి చేస్తే కేసీఆర్‌కు మద్దతు ఇచ్చినట్టే.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడటమంటే ఇదేనా రాజేంద్ర' అంటూ రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తన ఏకైక లక్ష్యంగా చెప్పుకొచ్చారు. దేవునిపై విశ్వాసం ఉంటే ఈటల మాటలు ఉపసంహరించుకోవాలని సూచించారు. కేసీఆర్ ముసుగుతో ఈటల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈటల ఆరోపణ నా మనోవేదనను దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి.. తాను అమ్ముడుపోయుంటే ప్రజల గుండెల్లో ఉండేవాడిని కాదని అన్నారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ కూడా స్పందించారు. తన ఆత్మవిశ్వాసం మీద తనకు నమ్మకం ఉందని.. అమ్మవారి మీద ఒట్టు వేసే అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.