'ఇదే మా చివరి పాట'.. మరణంలోనూ వీడని స్నేహం.. సరదాగా ఆడిపాడిన కొన్ని నిమిషాలకే.. - కర్ణాటక చన్నపట్న ఫ్రెండ్స్ కారు ప్రమాదం
🎬 Watch Now: Feature Video

ఈ యువకులు మరణంలోనూ తమ స్నేహాన్ని వీడలేదు. కర్ణాటకలో జరిగిన ఘోర ప్రమాదంలో ఘటనా స్థలిలోనే మృతిచెందారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందు వారు హుషారుగా పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన రామనగర జిల్లాలో జరిగింది.
రామనగరకు చెందిన వినయ్, విజయ్, మంజేశ్, నిఖిల్ ఓ పని కోసం కారులో మద్దూరు మండలం బెసగరహళ్లికి వెళ్లారు. పని ముగించుకుని రామనగరకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కారులో హుషారుగా పాటలు పాడారు. అందులో భాగంగా కన్నడ సినిమాలోని స్నేహితుల సాంగ్ 'కుచుకు కుచుకు' అనే పాటను ఉత్సాహంగా పాడుతూ రికార్డ్ చేశారు. చెన్నపట్న మండల కేంద్రం సమీపంలోకి రాగానే.. వారు ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వినయ్, మంజేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన విజయ్, నిఖిల్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరు చివరి సారిగా పాడిన పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.