''టీ' తో మోదీ PM అయితే, 'కాఫీ'తో డైరెక్టర్‌గా శేఖర్ కమ్ముల!' - sarkaru noukari trailer event
🎬 Watch Now: Feature Video
Published : Dec 20, 2023, 4:20 PM IST
Raghavendra Rao About Sekhar Kammula : దర్శకేంద్రుడు రాఘవేందర్ సొంత బ్యానర్‌పై తెరకెక్కిన 'సర్కారు నౌకరి' సినిమా ట్రైలర్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకులు శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి ముఖ్యఅతిథులుగా హాజరై సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం దర్శకుడు రాఘవేందర్ రావు మాట్లాడుతూ, ప్రేక్షకులు జయాపజయాలతో సంబంధం లేకుండా కొంతమంది డైరెక్టర్ల సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూడటం శుభపరిణామమని అన్నారు. అలాంటి దర్శకుల జాబితాలో దర్శకులు శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి ఉండటం సంతోషంగా ఉందని చెప్పారు. వారి సినిమాల కోసం ప్రేక్షకులు రెండుమూడేళ్లైనా ఎదురుచూడటం వారిలోని ప్రతిభకు అద్దంపడుతుందన్న ఆయన, డైరెక్టర్ శేఖర్ కమ్ములను మోదీతో పోలుస్తూ అభివర్ణించారు. ఇక ఈ సినిమాలో సీనియర్ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా నటించారు. ఆయనకు జోడీగా భావన నటించారు. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న 'సర్కారు నౌకరి' ప్రేక్షకుల ముందుకు రానుంది.