పంచ కట్టులో అర్చకుల క్రికెట్.. సంస్కృత భాషలో కామెంటరీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 6, 2023, 2:02 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

సాధారణంగా క్రికెటర్లు షాట్లతో విరుచుకుపడుతుంటే.. కామెంటరీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే ఇంగ్లీషు, హిందీ లేదా మరేదైనా ప్రాంతీయ భాషల్లో మనం క్రికెట్ కామెంటరీ వింటాం. కానీ ఈ మ్యాచ్​లో మాత్రం పూర్తి కామెంటరీ సంస్కృతంలోనే సాగింది. మధ్యప్రదేశ్​ భూపాల్​లోని అన్​కుర్​ మైదానం.. ప్రత్యేక క్రికెట్​ మ్యాచ్​కు వేదికైంది. బరిలో దిగిన వారందరూ రోజూ గుడిలో పూజలు చేసే అర్చకులు కావడం విశేషం. అయితే వీరు క్రికెట్​ ఆడటానికి ఓ కారణం ఉంది. సంస్కృతంపై ఉన్న మక్కువతో.. ఆ భాషను అందరికీ పరిచయం చేయాలనుకున్నారు. ఇందుకు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్​ను సాధనంగా ఎంచుకున్నారు. తమదైన శైలిలో ధోతి కట్టి.. నుదిటిన తిలకం దిద్దుకుని బ్యాట్​ పట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.