Pratidhwani: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు పొంది ఉందా..? ఏ ఏ రాష్ట్రం ఎన్నిసీట్లను కోల్పోనుంది..? - Redistribution of constituencies in India
🎬 Watch Now: Feature Video
Published : Sep 23, 2023, 9:27 PM IST
Pratidhwani Debate on Delimitation: డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన పూర్వరంగంలో నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను ఎలా పునర్విభజన చేస్తారు? వాటి సంఖ్య పెరగబోతోంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏ ప్రాతిపదికన పెంచుతారు? రిజర్వేషన్లను ఏ కొలమానాలు ఆధారంగా నిర్ణయిస్తారు? దీని వలన దక్షిణాది రాష్ట్రాలకి నష్టమనే వాదనా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో జరిగిన డీలిమిటేషన్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈసారి అలా జరగకుండా ఎటువంటి శాస్త్రీయ కొలమానాలు ఉండాలి? మహిళా రిజర్వేషన్లు అమలు కావాలంటే దాని అమలు డీలిమిటేషన్‌తో ముడిపడింది. అసలీ నియోజకవర్గాల పునర్విభజన అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? 2026 సంవత్సరంలో రాష్ట్రాల జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలు అన్నీ నష్టపోతాయి. కేరళ ప్రస్తుతమున్న 20 సీట్లలో 8 కోల్పోతుంది. తమిళనాడు 8 సీట్లను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చెరో నాలుగు చొప్పున మొత్తంగా 8 సీట్లను కోల్పోతాయని విశ్లేషకులు చెబుతున్నారు? మీరేమంటారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.