ఏది ఫేక్? ఏది రియల్?- దేశవ్యాప్తంగా కొత్త దుమారం రేపుతోన్న డీప్‌ఫేక్ టెక్నాలజీ
🎬 Watch Now: Feature Video
Pratidhwani Debate on Deepfake Technology: ఏది ఫేక్..? ఏది రియల్..? దేశవ్యాప్తంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ రేకెత్తించిన చర్చ ఇది. సినీ నటి రష్మికకు చెందిన ఫేక్ వీడియోతో అందరి దృష్టిలోకి వచ్చిందీ దుమారం. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ సైతం ఆ డీప్‌ఫేక్ దారుణాలపై స్పందించారు. స్వయాన తానూ దాని బాధితుడినే అన్నారు. కృత్రిమమేధను దుర్వినియోగం చేసి.. ఇలా డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలు సృష్టించడం అత్యంత సమస్యాత్మకం, పెను ఆందోళనకరమని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, ప్రముఖులు, మహిళల పరువు, ప్రతిష్ఠలకు భంగం కలించడం, చివరకు హింసకు ఆజ్యం పోయడం అనేక పర్యవసనాలున్నాయి ఈ డీప్‌ఫేక్‌తో అని నిపుణులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో దిద్దుబాట ఎలా? సాంకేతికతను ఎప్పుడూ రెండువైపులా పదునున్న కత్తిగా చెబుతుంటారు నిపుణులు. డీప్‌ఫేక్ టెక్నాలజీ రూపంలో అది మరోసారి నిరూపితమవుతోంది అనుకోవచ్చా? అసలు ఈ సాంకేతికతను ఏ ఉద్ధేశంతో తీసుకుని వచ్చారు? దేశవ్యాప్తంగా ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీ ఎన్నివిధాలుగా దుర్వినియోగం అవుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.