Prathidwani Debate on Class War in Andhra Pradesh: జగన్మోహన చక్రాల కిందపడి.. నలుగుతున్నాయ్ పేదల బతుకులు - ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
Prathidwani Debate on Class War in Andhra Pradesh: జరుగుతున్నది.. వర్గ పోరాటం. పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పదేపదే చెప్పే మాట ఇది. కానీ అందులో నిజమెంత? పోలీసుబూట‌్ల కింద నలిగి పోతున్న ప్రజాస్వామ్యం సాక్షిగా.. కాయకష్టం చేసుకునే రైతుల కంటతడి, అమరావతి రైతులపై అమానుష వైఖరి, వైసీపీ దౌర్జన్యాలకు తల్లడిల్లిన ఓ తల్లి ఆరుద్ర ఆక్రోశం.. ఇవన్నీ ఏం చెబుతున్నాయి? అన్నక్యాంటీన్లు కూల్చేయటం, పోలీసు వేధింపులతో ఓ పేద ముస్లిం కుటుంబం ఆత్మహత్య, వైసీపీ ఎమ్మెల్సీ బలికొన్న దళితుడి కుటుంబం ఆవేదన.. ఇవన్నీ దేనికి సంకేతం? తనను తాను పదేపదే పేద ముఖ్యమంత్రిగా, మీడియా బలం లేని వ్యక్తిగా జగన్ చెబుతున్నారు.. నిజంగా ఆయనకు మీడియా బలం లేదా? అంగబలం, ఆర్థికబలం లేదా? నిజంగానే జగన్‌కు పేదలపై ప్రేమ ఉంటే అన్నక్యాంటీన్లను మూసివేయడాన్ని ఎలా చూడాలి? జగన్ తనకు లొంగని వారిని క్రూరంగా అణిచివేస్తూ ఫ్యాక్షనిస్టులా ప్రవర్తిస్తూ.. తానొక పేదల ప్రతినిధిని అని చెబుతుంటే జనం నమ్ముతున్నారా? సీఎం పేద మంచి మాటలు.. వారి పెత్తందారీ బుద్ధులపై నేటి ప్రతిధ్వని.