డీప్‌ఫేక్ - కొంప ముంచబోతోందా? విలువలు, భద్రతాపరమైన అంశాల మాటేంటి?
🎬 Watch Now: Feature Video
Published : Jan 16, 2024, 8:34 PM IST
Prathidhwani: డీప్ ఫేక్.. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా దీని సంచలనాలే. ప్రముఖ సినీనటి రష్మికకి సంబంధించిన డీప్‌ఫేక్ వైరల్ అయిన సందర్భంలోనే ప్రధానమంత్రి మోదీ తానూ ఆ టెక్నాలజీ బాధితుడినే అని ప్రకటించారు. ఆ ముందు, వెనక కూడా ఎన్నో డీఫ్‌ఫేక్ వివాదాలు వెలుగు చూశాయి.. చూస్తునే ఉన్నాయి. బాధితలు జాబితాలో ఇప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ కూడా చేరారు. ఓ ప్రమోషనల్ వీడియోకు సంబంధించి అందులో ఉన్నది నేను కాదు అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరి ఎందుకీ ఉపద్రవం? చేతిలో సెల్‌ఫోన్.. ఫోన్‌లో యాప్స్ ఉంటే చాలు.. ఎవరైనా.. ఎవరికైనా డీప్ ఫేక్ సృష్టించవచ్చా? ఎదుటివారి గౌరవమర్యాదాలు, మానవ సంబంధాలు, విలువలు, భద్రతాపరమైన అంశాల మాటేంటి?
డీప్‌ఫేక్ కావొచ్చు, ఏఐ కావొచ్చు, మరొకటి కావొచ్చు, టెక్నాలజీని ప్రజల్లోకి వదిలేయడంతో సంస్థల బాధ్యత అయిపోతుందా? వీటి నియంత్రణ ఎలా ఉంటే మేలు దేశంలో? డీప్‌ఫేక్, కొన్ని ఇతర ఏఐ టూల్స్ దుర్వినియోగం బారిన పడిన వారికి ఉపశమనం కోసం ఏం చేయవచ్చు? అలాంటి వీడియో, ఫోటోలను ఎలా తొలగించుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.