ప్రసాదం బదులు డబ్బులు పంచే గుడి గురించి తెలుసా - కాళీమాతా ఆలయం డబ్బు పంపిణీ
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలోని ఓ కాళీమాతా ఆలయంలో భక్తులకు ప్రసాదం రూపంలో డబ్బులు పంచారు. అమరావతిలోని ఆలయంలో దీపావళి రోజున భక్తులకు డబ్బులు పంచితే మంచిదని, అందుకే ఇలా చేసినట్లు అక్కడి పూజారి శక్తి మహారాజ్ తెలిపారు. 1984లో తానే ఈ ఆచారం ప్రారంభించినట్లు పూజారి వెల్లడించారు. కాళీమాతా ఆశీర్వాదం వల్లనే తాను ఇలా చేయగలుగుతున్నానని ఈటీవీ భారత్కు తెలిపారు.
సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకు పది రూపాయల నోట్లను పెద్ద గిన్నెలో ఉంచి ఒక్కొక్కరికీ రెండు, మూడు నోట్లు ఇచ్చారు. కాళీమాతను దర్శనం చేసుకుని ప్రసాదం పొందడానికి అనేక మంది భక్తులు తరలివచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST