ప్రచారంలో 'కరెంట్' మంటలు - బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మాటల తూటాలు - విద్యుత్‌పై కేటీఆర్ VS రేవంత్
🎬 Watch Now: Feature Video
Published : Nov 9, 2023, 6:57 AM IST
Political Leaders Comments on current in Telangana : రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా.. రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. రోజు రోజుకి ప్రచారంలో రాజకీయ నాయకులు చేసుకుంటున్న విమర్శలు, ప్రతి విమర్శలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ 9 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై ప్రచారం చేస్తే.. అదే 9 ఏళ్ల పాలనలో వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ అంశం ఇరుపార్టీల మధ్య మంటలు పుట్టిస్తోంది.
Political Fire Between Revant Reddy and KTR : అధికార, విపక్షాల మధ్య కరెంటు విషయంలో మంటలు చెలరేగుతున్నాయి. 24 గంటల విద్యుత్ ఇస్తే నామినేషన్ వేయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(REVANTH REDDY) సవాల్ విసరగా.. కరెంటు తీగలు పట్టుకోవడానికి సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలు ప్రతిసవాల్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్(KTR) సంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా.. కరెంట్ తీగలను పట్టుకుంటే తెలుస్తుందని బదులు ఇచ్చారు.