ఐపీఎల్​ ఫ్యాన్స్​పై పోలీసుల లాఠీఛార్జ్​.. అదే కారణం - క్రికెట్​ ఫ్యాన్స్​పై పోలీసుల లాఠీ ఛార్జ్​ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2023, 1:59 PM IST

సోమవారం జరిగిన ఐపీఎల్​ చివరి మ్యాచ్​ను చూసేందుకు వచ్చిన క్రికెట్​ ఫ్యాన్స్​పై గుజరాత్ పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. ఫిజికల్​ టికెట్స్​ ఉన్నవారిని మాత్రమే మైదానం లోపలికి అనుమతించారంటూ.. ఈ-టికెట్స్​ వారికి పర్మిషన్​ ఇవ్వట్లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగి స్టేడియం బయటే ఆందోళనకు దిగారు క్రికెట్​ ఫ్యాన్స్​. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. అయినా వాటిని తోసుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేసిన అభిమానులపై లాఠీఛార్జ్​ చేశారు. లాఠీఛార్జ్​ సమయంలో జనం మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మ్యాచ్​ ఆరంభానికి ముందు మైదానంలోకి అనుమతించే క్రమంలో స్టేడియం బయట ఈ ఘటన జరిగింది. చివరకు స్టేడియం గేట్లను తెరిచి అందరినీ మైదానంలోకి అనుమతించారు అధికారులు. కాగా, ఈ సీజన్​లో చివరి మ్యాచ్​ కావడం వల్ల ప్రజలు భారీగా ఎత్తున తరలివచ్చారు.

గుజరాత్​ అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియంలో వేదికగా జరిగిన ఐపీఎల్​ సీజన్​ 16 చివరి మ్యాచ్​ రసవత్తరంగా సాగింది. బలమైన జట్లైన సీఎస్​కే, గుజరాత్​ టైటాన్స్ మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్​లో ఐదోసారి చెన్నై టైటిల్​ను ముద్దాడింది. దీంతో వరుసగా రెండోసారి కూడా ట్రోపీను చేజిక్కించుకోవాలనుకున్న గుజరాత్​ నిరాశతో వెనుదిరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.