ఎన్నికల ప్రచారంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగం - అంబం గ్రామంలో ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 6, 2023, 5:36 PM IST
|Updated : Nov 6, 2023, 6:06 PM IST
Pocharam Srinivas Reddy Emotional in Election Campaign : రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కొందరు కోరుతుండగా.. మరోసారి అవకాశం ఇవ్వాలని ఇంకొందరు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సభాపతి పోచారం భావోద్వేగానికి గురయ్యారు. అంబం గ్రామంలో ప్రచారం చేస్తుండగా.. అదే గ్రామానికి చెందిన సాయిలు, అతని కుమార్తె సుష్మ ప్రచారంలో పాల్గొని.. గతంలో పోచారం చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆయన కాస్త భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టారు.
Pocharam Emotional speech : ఈ సందర్భంగా 2018లో తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన కార్యకర్త అయిన సాయిలు కుమార్తె వివాహం జరిగిందని పోచారం గుర్తు చేశారు. ఆ సమయంలో తన కార్యకర్త అల్లుడు అనారోగ్యం బారిన పడటంతో వైద్యం కోసం డాక్టర్లను సంప్రదించి ఆర్థిక సాయం చేశానని తెలిపారు.