PM Modi On Telangana Formation in Parliament : 'తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది.. రక్తపుటేర్లు పారాయి' - PM Modi On Telangana Formation in Parliament
🎬 Watch Now: Feature Video
Published : Sep 18, 2023, 1:12 PM IST
PM Modi On Telangana Formation in Parliament : నేటి నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందన్న మోదీ.. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ఇరువర్గాలనూ సంతృప్తిపరచలేకపోయిందని.. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబురాలు చేసుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ విభజన జరగలేదని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో ఏపీ, తెలంగాణ ఇరువర్గాలూ అసంతృప్తికి గురయ్యాయని తెలిపారు.
PM Modi On Andhra Pradesh Bifurcation in Parliament : 'తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తపుటేర్లు పారాయి. రాష్ట్ర విభజన ఇరువర్గాలనూ సంతృప్తిపరచలేకపోయింది. కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబురాలు చేసుకోలేకపోయింది. ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ విభజన జరగలేదు. ఆంధ్రప్రదేశ్ విభజనలో ఏపీ, తెలంగాణ ఇరువర్గాలూ అసంతృప్తికి గురయ్యాయి' అని మోదీ అన్నారు.