ధోతీ కట్టుకొని క్రికెట్ మ్యాచ్- సంస్కృతంలో కామెంటరీ- గెలిచిన జట్టుకు అయోధ్య దర్శనం
🎬 Watch Now: Feature Video
Playing Cricket In Dhoti : మధ్యప్రదేశ్‌లో వినూత్న క్రికెట్ టోర్నీ జరిగింది. సంప్రదాయ దుస్తులు ధరించి క్రికెట్ ఆడారు ప్లేయర్లు. ధోతీ, కుర్తా, లుంగీలు ధరించి క్రికెట్ ఆడారు యువకులు. భోపాల్‌కు చెందిన మహర్షి మైత్రి మ్యాచ్ టోర్నమెంట్ ఈ వినూత్న పోటీలు నిర్వహించింది. శుక్రవారం ఈ టోర్నీ ప్రారంభమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లంతా ధోతి, కుర్తా, లుంగీలో కనిపించారు. మ్యాచ్‌కు తగ్గట్టు కామెంటరీ సైతం వినూత్నంగానే సాగింది. ప్లేయర్లు ఆడుతుండగా సంస్కృతంలో కామెంటరీ చెప్పించారు నిర్వాహకులు. మొత్తంగా 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. గెలిచిన టీమ్‌కు బంపర్ ఆఫర్‌ను సైతం ప్రకటించారు నిర్వాహకులు. విజేతగా నిలిచే జట్టులోని సభ్యులను అయోధ్య రాముడి దర్శనానికి తీసుకెళ్తామని ప్రకటించింది.
'మన సంస్కృతికి ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో ఈ టోర్నీ నిర్వహించాం. ఈసారి గెలిచిన టీమ్‌ను అయోధ్యకు తీసుకెళ్తాం. వేద బ్రాహ్మణులంతా ఈ టోర్నీలో పాల్గొన్నారు. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన వ్యక్తికి శతాబ్ది పంచాంగం పుస్తకాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యే ప్లేయర్లకు భగవద్గీత, పురాణ, ఇతిహాస పుస్తకాలను ఇస్తాం' అని నిర్వాహక కమిటీ ఛైర్మన్ అభిషేక్ దుబె తెలిపారు.