Face Cleansing Mistakes in Telugu: అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు? ఇందుకోసమే మార్కెట్లో దొరికే అనేక రకాల పదార్థాలు, చిట్కాలు పాటిస్తుంటారు. కానీ, ముఖం కడుక్కునే సమయంలో చేసే పొరపాట్ల వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే ఫేస్ వాష్ చేసే సమయంలో ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యకరమైన చర్మం కోసం ఏ జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ నీటితో ముఖం కడగాలట!: ముఖం కడిగే సమయంలో సరైన నీటిని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేడి నీరు చర్మాన్ని త్వరగా పొడిగా చేస్తుందని, అదే చల్లటి నీరైతే చర్మంపైన ఉన్న రంధ్రాలు తెరుచుకోవని అంటున్నారు. అందుకే మరీ చల్లగా, వేడిగా కాకుండా గోరు వెచ్చటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలని ప్రముఖ డెర్మటాలజిస్ట్ మైఖెల్ గ్రీన్ సూచిస్తున్నారు.
![Face Cleansing Mistakes in Telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23536407_face_wash_tips_telugu-2.jpg)
తరచూగా ఫేస్ వాష్ చేయకూడదు: పొడి చర్మం ఉన్నవారు కేవలం రోజుకొకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. అదే ఆయిల్ స్కిన్ ఉన్నవారు రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. అంతకన్నా ఎక్కువసార్లు కడిగితే చర్మం పొడిగా మారుతుందని వివరిస్తున్నారు. ఒకవేళ మీరు ఒకసారి ఫేస్ వాష్ చేసేవారు అయితే ఉదయం కన్నా రాత్రి కడుక్కోవడమే మేలని సూచిస్తున్నారు. రోజంతా ముఖంపై పేరుకుపోయిన కాలుష్య కారకాలను రాత్రి పూట క్లీన్ చేసుకోవచ్చని వివరిస్తున్నారు. ఎండతో పాటు కాలుష్యం కూడా చర్మం ముడతలు పడేలా చేస్తుందని తెలిపారు. 2016లో Journal of Dermatologyలో ప్రచురితమైన "The Relationship Between Face Washing Frequency and Skin Problems in a General Population" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
దానిని ఎక్కువగా ఉపయోగించకూడదు: మృతకణాలను తొలగించి చర్మం మెరిసేలా చేయడంలో ఎక్స్పోలియేటింగ్ క్లెన్సర్ బాగా ఉపయోగపడుతంది. కానీ దీనిని తరచూగా వాడడం వల్ల చర్మం పొడిగా మారుతుందని డెర్మటాలజిస్ట్ ఇవీ లీ తెలిపారు. ఎక్కువ సార్లు చేయడం వల్ల చర్మం చికాకుగా అవుతుందని వివరిస్తున్నారు.
మురికి వస్త్రాలను వాడడం: శుభ్రమైన, మెత్తటి వస్త్రాన్ని వాడడం వల్ల చర్మం క్లీన్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖాన్ని తుడుచుకునే తవల్ను కనీసం రెండు రోజులకోకసారైనా మార్చాలని సూచిస్తున్నారు. ఎందుకంటే తవల్పై బ్యాక్టీరియా పేరుకుపోతుందని.. అందుకే కొద్దిగా కష్టమైనా తప్పనిసరిగా మార్చాలని సలహా ఇస్తున్నారు.
![Face Cleansing Mistakes in Telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23536407_face_wash_tips_telugu-4.jpg)
ఫేసియల్ వైప్స్ అప్పుడే వాడాలి: ముఖాన్ని తుడుచుకునేందుకు ఫేస్ వైప్స్ చక్కగా ఉపయోగపడతాయి. అలాగానీ ఫేస్ వాష్ కోసం పూర్తిగా వాటిపైనే ఆధారపడకూడదని డాక్టర్ మైఖెల్ గ్రీన్ చెబుతున్నారు. ఫేస్ వాష్ కోసం తప్పనిసరిగా క్లెన్సర్, నీటినే వాడాలని సూచిస్తున్నారు. వైప్స్‌లో అనేక రసాయనాలు ఉంటాయని.. ఇవి చర్మానికి హానీ కలిగిస్తాయని వివరిస్తున్నారు.
సరైన ఉత్పత్తులను ఎంచుకోవాలి: చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఫేస్ వాష్ ఉత్పత్తులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఫోమింగ్, పొడి చర్మం ఉన్నవారు తేమ ఎక్కువగా ఉండే ఫేస్ వాష్ ఉత్పత్తులు వాడాలని చెబుతున్నారు. ఆయిల్ స్కిన్ కోసం అల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, సలియాక్ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అదే సమయంలో వీటిని ఆయిల్ స్కిన్ లేనివారు వాడితే చర్మం జిడ్డుగా మారుతుందని వివరిస్తున్నారు. అదే సున్నితమైన చర్మం, మొటిమలతో ఉంటే మైల్డ్ వాష్ ఉత్పత్తులను వాడాలని సలహా ఇస్తున్నారు. అయితే, ఇవన్నీ చెడు ఉత్పత్తులు కావని.. కొందరి చర్మానికి సరిపోవని పేర్కొన్నారు.
![Face Cleansing Mistakes in Telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/23536407_face_wash_tips_telugu-1.jpg)
వాటిని వాడకూడదు: నాన్ సోప్ క్లెన్సర్కు ప్రత్యామ్నాయంగా సబ్బును వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఉత్పత్తులు సహజ నూనెలను తొలగించి.. చర్మాన్ని పొడిగా, చికాకుగా చేస్తాయని తెలిపారు. అదే నాన్ సోప్ ఉత్పత్తులు చర్మాన్ని తేమగా ఉంచి ఆరోగ్యంగా ఉంచుతుందని వివరిస్తున్నారు.
మసాజ్ చేస్తే మంచి ఫలితాలు: మెరుగైన ఫలితాల కోసం క్లెన్సర్‌ను చర్మంపై గుండ్రంగా మసాజ్ చేయాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ సాఫీగా జరిగి వ్యర్థాలను బయటకు పంపిస్తుందని వివరిస్తున్నారు.
బలవంతంగా రుద్దకూడదు: ముఖ్యంగా క్లెన్సర్ పెట్టి బలవంతంగా రుద్దకూడదని సలహా ఇస్తున్నారు. గట్టిగా రుద్దితే వ్యర్థాలు పోవని.. సున్నితంగా మసాజ్ చేయాలని సూచిస్తున్నారు. ఇంకా తవల్తో గట్టిగా రుద్దితే చర్మంపై రక్షణగా ఉన్న అనేక ప్రొటీన్లు, లిపిడ్లు, ఫ్యాటీ యాసిడ్లు పోయి చికాకును తెప్పిస్తాయని తెలిపారు.
మాయిశ్చరైజ్ అప్పుడే చేయాలి: ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్లు, క్రీములు పెట్టుకునేందుకు మంచి సమయమని చెబుతున్నారు. ఇంకా మేకప్, క్లెన్సర్లను పూర్తిగా తొలగించకపోవడం వల్ల చర్మం చికాకు, పగుళ్లు ఏర్పడతాయని అంటున్నారు. ఒకవేళ మీరు ఫోమ్ క్లెన్సర్ వాడుతుంటే ఫేస్ మొత్తం నురగను రుద్దాలని, అదే క్రీమ్ అయితే చర్మంపై సన్నటి పొరలా పెట్టాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
1-3-5 రూల్ మీకు తెలుసా? ఇలా చేస్తే ఈజీగా ఇళ్లంతా క్లీన్, నీట్‌గా మారిపోతుంది!
రోజూ తలస్నానం చేయడం మంచిది కాదా? తడిపై జుట్టు దువ్వితే ఏం జరుగుతుందో తెలుసా?