Payyavula Keshav Reaction on CID False Propaganda: సీమెన్స్‌ సంస్థ రాసిన లేఖను బయటపెడతారా..? సీఐడీకి పయ్యావుల సవాల్‌ - Payyavula Keshav comments on CID

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 8:13 PM IST

Payyavula Keshav Reaction on CID False Propaganda: స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో తమకు సంబంధం లేదని సీమెన్స్‌ సంస్థ లేఖ రాసిందని చెబుతున్న సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం.. ఆ లేఖను బయటపెట్టాలని తెలుగుదేశం సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. సీమెన్స్‌ సంస్థ లేఖ రాసిందని చెప్పడం శుద్ధ అవాస్తవమని పయ్యావుల మండిపడ్డారు. అసత్య ఆరోపణలతో ప్రజలను, న్యాయస్థానాలను మభ్యపెట్టేందుకు సీఐడీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 శాతం నిధుల విషయంలోనూ ఇలాంటి ప్రచారాన్నే చేస్తోందని కేశవ్ విమర్శించారు. లక్షల మంది శిక్షణ పొంది, తద్వారా ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశంసా పత్రం ఇచ్చారని అన్నారు. అలాంటప్పుడు అవినీతి ఎక్కడ జరగిందని నిలదీశారు. నేడు తెలుగు యువత ప్రపంచదేశాల్లో ఎన్నో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు వల్లేనని అన్నారు. ఈ దుశ్చర్య కేవలం చంద్రబాబు మీద బురదజల్లాలనే కుయుక్తులతోనే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గానికి శ్రీకారం చుట్టిందని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.