Pariki Cheruvu Nuraga Video in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. చెరువులో నీటికి బదులు నురగ - హైదరాబాద్ వర్షాలు
🎬 Watch Now: Feature Video
Published : Sep 5, 2023, 4:09 PM IST
Pariki Cheruvu Nuraga Video at Kukatpally in Hyderabad : భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్ని నిండిపోతున్నాయి. దీంతో వరద నీరు రోడ్లపైకి వచ్చి.. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకి కూకట్‌పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీ, డివిజన్ ధరణినగర్ కాలనీలో వరద నీరు తీవ్రంగా వచ్చి చేరుతుంది. దీంతో రోడ్లు వరద నీటితో మునిగిపోతున్నాయి. ఆ ప్రాంతంలో ఎగువన ఉన్న పరికి చెరువు(Pariki Cheruvu) నుంచి పక్కన ఉన్న ప్రాంతాలకు భారీగా నురగ వస్తోంది. దీంతో ఆ చెరువులో ఉన్న మురికి నీరు అంతా జనవాసంలోకి రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నురగ ఎక్కవగా వస్తున్నందున రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జనావాసాల్లోకి వరద నీటితో పాటు.. నురగ ఎక్కువగా చేరుతుందన్నందున స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నురగ అంతా వచ్చి ఇళ్లలోకి వెళుతుందని.. వ్యాధులు వ్యాపించేందుకు ఎక్కువ అవకాశం ఉందని వాపోతున్నారు. వెంటనే దీనిపై అధికారులు తగిన చర్యలు చేపట్టాలని.. నురగని కంట్రోల్ చేయాలని కోరుతున్నారు.